ఫిబ్రవరి 26 నుంచి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
పార్టీనీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి క్రియాశీలక సభ్యత్వం (ఉద్యమి) నమోదు చేయాలి
—- MLC హరి ప్రసాద్, మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు
నిన్న రాత్రి గుంటూరు పార్లమెంటరీ జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం సమన్వయకర్త పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో APMSIDC ఛైర్మన్ & జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు, క్రియాశీలక సభ్యత్వ వాలంటరీలు (సాధక్) లతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ముందుగా ఈ సమావేశానికి విచ్చేసిన హరి ప్రసాద్ కి చిల్లపల్లి శ్రీనివాసరావు శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
ఉప ముఖ్యమంత్రి & జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు ఫిబ్రవరి 26 నుంచి జనసేన క్రియాశీలక ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని, సాధకులు సిద్ధం కావాలని, జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని ఉద్యమి సభ్యత్వ నమోదు చేసుకోవాలని అన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికమైన సభ్యత్వలను నమోదు చేయాలని గత సంవత్సరంలో 10 వేలు పైగా సభ్యత్వలు నమోదు చేసి గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గం రెండో స్థానంలో ఉందని ఈసారి రెట్టింపు సభ్యత్వాలు నమోదు చేసి జిల్లాలోనే మొదటి స్థానంలో మంగళగిరి నియోజకవర్గం ఉండాలని పేర్కొన్నారు.
పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ సమన్వయం పరుచుకుంటూ మహా యజ్ఞం లాగా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయాలని దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఐటి విభాగం కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు, కేంద్ర కార్యాలయం సభ్యత్వ నమోదు సమన్వయకర్త గంజి చిరంజీవి, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, సాధకులు తదితరులు పాల్గొన్నారు.

