జగద్గిరిగుట్టను స్థాపించింది సిపిఐ పార్టీనే.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
సాక్షిత : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడే సిపిఐ పార్టీ స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అలాగే సిపిఐ చేసిన పోరాటాలను ప్రచారం చేయడానికి నిర్వహిస్తున్నటువంటి ఇంటింటికి సిపిఐ కార్యక్రమం లో భాగంగా రెండవ రోజు జగద్గిరిగుట్టలోని బీరప్ప నగర్ మరియు దేవమ్మ బస్తిలో గల్లి గల్లి తిరుగుతూ సిపిఐ చేసిన కార్యక్రమాలను మరియు ప్రజా సమస్యలను వివరించే కరపత్రాలను పంచడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా సిపిఐ పార్టీ కొన్ని లక్షల ఎకరాలను భూములు లేని పేద వాళ్లకు పంచిన చరిత్ర సిపిఐ కె ఉన్నదని దున్నేవానికే భూమి అనే నినాదంతో భూ పోరాటాలను నిర్వహించి ఇండ్లు లేని నిరుపేదలను సమీకరించి ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలను పాతి గుడిసెలను వేయించిన చరిత్ర కేవలం సిపిఐ పార్టీకే ఉన్నదని అన్నారు.అలా గుడిసెలు వేయించిన ప్రాంతమే నేటి జగద్గిరిగుట్ట అని అన్నారు.
ఈ జగద్గిరిగుట్ట నేడు మినీ ఇండియా గా విరాజిల్లుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు మరియు రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నరు అంటే దానికి కారణం గతంలో సిపిఐ చేసిన పోరాటాల వల్లనే ఇది సాధ్యమైందని కొనియాడారు. జగద్గిరిగుట్టలో కొత్తగా వచ్చిన వారికి ఈ చరిత్ర తెలియదనీ అలాంటి చరిత్రను తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అదేవిధంగా అన్ని బస్తీలలో మరోసారి సిపిఐ పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని కావున ప్రజలందరూ తమ సమస్యలను సిపిఐ పార్టీకి తెలియజేస్తే రానున్న రోజుల్లో పోరాటాలు నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
ఈ పాదయాత్ర సందర్భంగా బస్తీలలోని అనేక మంది ప్రజలు తమ తమ అభిప్రాయాలను పార్టీ నాయకులకు చెబుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్, రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం, మండల కార్యదర్శి కే స్వామి, మహిళా సమైక్య అధ్యక్షురాలు హైమావతి, సహయ కార్యదర్శి హరినాథ్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, న్యాయవాది సత్యనారాయణ, శాఖ కార్యదర్శులు సహదేవరెడ్డి కే వెంకటేష్, వీరస్వామి కొండయ్య, రాజు నాగేశ్వరి చంద్రయ్య బాలరాజు ఇమామ్ సామెల్ ఆశయ పీటర్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY