హుస్నాబాద్ మున్సిపల్ లో గులాబీ జెండా ఎగరడం
ఖాయం
-ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుదాం
-తెలంగాణ ప్రజల పక్షపాతి కెసిఆర్ కు మరకలు అంటించే కుట్రలు సాగనివ్వం
-మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి పనిచేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
-మంత్రి పొన్నం ప్రభాకర్ మాయ మాటలు నమ్మకండి
-హుస్నాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే సమగ్ర అభివృద్ధి
-హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు
హుస్నాబాద్, ఫిబ్రవరి 7;
హుస్నాబాద్ పట్టణ ప్రజల సహకారంతో మున్సిపల్ పై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని 3,4,5,16 వార్డుల్లో స్థానిక అభ్యర్థులు, నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ప్రజలకు సాగు, తాగునీళ్లు ఇచ్చి పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా అభివృద్ధిని పరుగులెత్తించి దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ కు మరకలు అంటించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తోపాటు ఇతర నాయకులపై కమిషన్లు, కేసులు నోటీసులు అంటూ వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కమిషన్లు, విచారణలు ఇప్పటివరకు ఏమి తేల్చాయో చెప్పాలన్నారు.
హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన అవసరానికి తగ్గట్లు ప్రవర్తిస్తాడని అన్నారు. ఓట్లకు ముందు అందరిని దగ్గరికి తీసుకొని పైపై ప్రేమను నటిస్తూ ఓట్లు అయిపోయాక ఇటువైపు చూడకుండా హైదరాబాదులోనే మకాం వేస్తాడు అన్నారు. ఉచిత బస్సు, రేషన్ కార్డులు ఇచ్చి అన్నీ చేశామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అన్నారు. మహిళలకు నెలకు 2500, తులం బంగారం, స్కూటీలు, ఆసరా పింఛన్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ దేనని విమర్శించారు. హుస్నాబాద్ లో ఓడిపోతామనే భయంతోనే మంత్రి పొన్నం
బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ గా చేసిన వారిని పార్టీలోకి తీసుకొని బీఆర్ఎస్ అభ్యర్థులను భయపెడుతూ ప్రలోభాలకు గురి చేసే కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయంతోనే హుస్నాబాద్ సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, పట్టణ ప్రజలు మాయ మాటలు, గారడీ చేష్టలను నమ్మి మోసపోవద్దని కోరారు.
పట్టణంలోని 20 వార్డుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

