కాజీపేట హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..
హనుమకొండ,
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కాజీపేటలోని ఎన్ఐటీ సమీపంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శాఖలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బ్యాంకు అధికారుల ఆహ్వానం మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి కుమార్తె డాక్టర్ శ్రీగోధ విష్ణు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బ్యాంకులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
నేటి సమాజంలో మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు, గుర్తింపు లభించడం గర్వకారణమని తెలిపారు. వంటింటి నుంచి అంతరిక్షం వరకు మహిళలు తమ ప్రతిభను చాటుతూ ప్రతి రంగంలో రాణిస్తున్నారని ఆమె అన్నారు.
స్థానికంగా మహిళలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని, తమ ఇంటి తలుపులు ఎల్లప్పుడూ ప్రజలకు తెరిచే ఉంటాయని మహిళా ఉద్యోగులకు భరోసా కల్పించారు.
ఈ బ్యాంకు పూర్తిస్థాయిలో మహిళా ఉద్యోగుల చేత నిర్వహించబడుతున్న శాఖ కావడం విశేషమని, ఇది మహిళా సాధికారతకు మంచి ఉదాహరణగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మహిళా సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
