అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ కూకట్పల్లి వై జంక్షన్

Sakshitha news

అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ కూకట్పల్లి వై జంక్షన్ లో గల ది చెన్నయ్ సిల్క్స్ షాప్‌ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్బంగా నూతనంగా యువతులకు ప్రత్యేకంగా రూపొందించిన కలెక్షన్ విభాగాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువతకు అనుగుణంగా డిజైన్లు, ఫ్యాషన్ ట్రెండ్స్ అందించడంలో చెన్నయ్ సిల్క్స్ ముందంజలో ఉంది. స్థానికంగా ఇలాంటి కొత్త విభాగాలు అందుబాటులోకి రావడం వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగిస్తుంది. సిబ్బంది పలు డిజైనర్ డ్రెస్ లను చూపించడం జరిగింది అని. అలాగే కూకట్పల్లి ప్రాంత ప్రజలకు మంచి నాణ్యత, అద్భుతమైన ఎంపికలు అందించడం గర్వకారణం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో షాప్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు, సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.