నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ని మర్యాదపూర్వకంగా కలిసిన నిజాంపేట్ డబుల్ బెడ్ రూమ్స్ 13వ బ్లాక్ నూతన సంక్షేమ సంఘ కార్యవర్గం…_
సాక్షిత : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ డబుల్ బెడ్ రూమ్స్ 13వ-బ్లాక్
నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సురేష్ ముదిరాజ్, నూతన సంక్షేమ సంఘం సభ్యులు, నిజాంపేట్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ గార్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట్ డబుల్ బెడ్ రూమ్స్ 13వ బ్లాక్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సురేష్ ముదిరాజ్, మరియు వారి కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ సంక్షేమం సంఘం సభ్యులు ఐకమత్యంతో ఒకతాటిపై ఉండి పనిచేసినప్పుడే కాలనీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ డబుల్ బెడ్ రూమ్స్ 13వ బ్లాక్ నూతన సంక్షేమ సంఘ కార్యవర్గం వైస్ ప్రెసిడెంట్ శేఖర్, జనరల్ సెక్రెటరీ కాంతారెడ్డి, ట్రెజరర్ సందీప్, జాయింట్ సెక్రటరీ అబ్దుల్ రావుఫ్, సభ్యులు రమేష్,మొహమ్మద్ యూనిస్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
