ఫ్లై ఓవర్ పై సూచిక బోర్డులు ఏర్పాటు
** స్మార్ట్ సిటీ ఎండీ హోదాలో మున్సిపల్ కమిషనర్
…..
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా నిర్మించిన గరుడవారధి ఫ్లై ఓవర్ పై సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య కోరారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ అధికారులు, స్మార్ట్ సిటీ అధికారులు, ఆఫ్కాన్స్ సంస్థ ప్రతినిధులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గరుడ వారధి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తదితర ప్రాజెక్ట్ ల పురోగతిని ఆయా సంస్థల ప్రతినిధులు వివరించారు. ఈ సందర్బంగా మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య మాట్లాడుతూ గరుడవారధి రోడ్ల నిర్వహణ బాగా ఉండాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గరుడవారధి కింద డివైడర్ల మధ్య, కూడళ్లలో పచ్చదనం పెంచేలా మొక్కలు నాటాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో ఏర్పాటు చేస్తున్న సిసి కెమెరాల పనులు డిసెంబర్ నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్మార్ట్ సిటీ జి.ఎం. చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, ఈఈ రవి, డిసిపీ ఖాన్, డి.ఈ.లు రాజు, శిల్ప, ఏసీపీ లు మూర్తి, మధు, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
