ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుంది.322జీవో తో
సాక్షిత : పడుగుపాడు సీఈవో కె. గోవర్ధన్ రెడ్డి.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అసోసియేషన్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సొసైటీ సీఈవో కొండూరు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కొత్తగా సొసైటీ ఉద్యోగులకు విడుదల చేసిన 322 జీవో ఉద్యోగులకు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర జే.ఏ.సీ. పిలుపుమేరకు ఆ కరపత్రాలను కాల్చి వేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీ ఉద్యోగులు గత కొన్ని నెలలుగా ఉద్యోగ సమస్యలపై నిరాహార దీక్షలు చేయడం జరిగిందని న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి తూతు మంత్రముగా సొసైటీ ఉద్యోగులకు 322జీవోని అమలు పరచడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వం సొసైటీ ఉద్యోగులకు ఇచ్చిన జీవోలో న్యాయం జరకపోగా అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన 322 జీవోని తక్షణమే రద్దుచేసి దాన్ని సవరించి మరొక జీవోని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేడు రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు 322 జీవో కరపత్రాలను తగలబెట్టడం జరిగిందని తెలిపారు, న్యాయం జరగకపోతే పోరాటాలు ఉదృతం అవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పడుగుపాడు సొసైటీ ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
