అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు

Sakshitha news

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు..
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం *

సాక్షిత : నార్కెట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల, ఔరవాణి గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన..

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ..

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐతగోని యాదయ్య, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :-

బ్రహ్మాణవెల్లంల, ఔరవాణి గ్రామాల్లో…
2018 నిర్మాణం లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నాయి, వాటి కోసం నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేస్తాం..

గడిచిన ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు..

గూడు కోసం ఎదురుచూస్తున్న పేదవారి కోసం 3500 ఇండ్లు కేటాయించాం..

నల్గొండ జిల్లాలో శివన్నగూడెం, బ్రాహ్మణవెల్లంల, డిండి, నక్కలగండి, పిలాయిపల్లి, ధర్మరెడ్డి నీళ్లు వచ్చే ఏ ప్రాజెక్టు ను పూర్తి చేయలేదు…

ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు ను పూర్తి చేసి నేడు కాలువల ద్వారా సాగు నీరు అందిస్తున్నాం

గత ప్రభుత్వంలో బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు మీద వివక్ష చూపారు..

ఈ రాష్ట్రన్ని గత పాలకులు అన్ని రకాలుగా విద్వసం చేశారు.. నీళ్ల విషయంలో బంకచర్ల ప్రాజెక్టు విషయంలో నాటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకి లాభం చేకూరే ప్రయత్నం చేశారు…

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారు..