నశింపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు పంపిణీ
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ఆత్మకూరు ఎస్ మండలం నశింపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గం ఇన్చార్జి మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ మెంబర్ రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనా రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు పంపిని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ఎంపీడీవో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మూల యల్లయ్య, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
