కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్రలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ను *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి * చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్‌ను ప్రారంభించామని తెలిపారు. ఈ క్యాంటీన్‌ను మంతన్న చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంటూ, మహిళా సాధికారత దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని, మహిళా స్వయం ఉపాధికి తోడ్పాటు అందించడం, ప్రజలకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయబడింది తెలిపారు .
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాముని శ్రవణ్ ముదిరాజ్, బేకు శ్రీనివాస్, లక్ష్మీ చౌదరి, మైసీగారి శ్రీనివాస్, సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, జక్కుల మల్లేష్ యాదవ్, ముత్యం రెడ్డి, బండి శ్రీనివాస్ గౌడ్, రంగయ్య, బాలప్ప, సుజాత యాదవ్, నాగ, రేవతి, మాధురి, కూన చింటూ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY