ప్రపంచ విజేత శ్రీచరణికి ప్రోత్సాహకర ప్యాకేజీ
** అభినందించిన “శాప్” చైర్మన్ రవినాయుడు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ప్రపంచ విజేత శ్రీచరణికి ప్రోత్సాహకరమైన ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని “శాప్” చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. అందులో భాగంగా మహిళా క్రీడాకారిణుల ప్రోత్సాహార్థం శ్రీచరణికి రూ.2.5 కోట్లు నగదు, గ్రూప్ –1ఉద్యోగం, కడపలో గృహ స్థలం ఇచ్చి
మహిళా క్రీడలకు కొత్త దశ ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కొనియాడారు. క్రీడల పట్ల అంకితభావం చూపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
క్రికెట్‌తో పాటు అన్ని క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు.
క్రీడా ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పారు.
ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు “శాప్” చైర్మన్ రవి నాయుడు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
