విపిఆర్ ఫౌండేషన్ ‘అమృత ధార’ వాటర్ ప్లాంట్ ప్రారంభం
ప్రారంభించిన కోవూరు- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అమృత ధార’ ఆర్వో వాటర్ ప్లాంట్‌ను వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పవిత్ర సంకల్పంతో 2016లో ఉదయగిరిలో ప్రారంభమైన అమృత ధార ప్రస్థానం నేడు జిల్లా అంతటా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజల దాహార్తినితీరుస్తున్నామన్నారు.కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుందనివారు హామీ ఇచ్చారు.
విడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రులు డాక్టర్లు ఉండడం లేదని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లా వైద్యాధికారి తో ఫోన్లో మాట్లాడి విడనూరు హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ లో డాక్టర్లను కొనసాగించాలని కోరారు.కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పార్లపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ జల్ జీవన్ మిషన్ ద్వారా 36 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్, 11 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం, 3 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేసిన విషయాన్ని వారుతెలిపారు.ఈ కార్యక్రమంలో విడవలూరు మండలం అధ్యక్షులు యేటూరుశ్రీహరి రెడ్డి,అచ్యుత్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణరెడ్డి, ఆవుల వాసు, చెముకుల కృష్ణ చైతన్య మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY