రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు నాయుడుకే సాధ్యం

Sakshitha news

రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు నాయుడుకే సాధ్యం

** యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నరసింహ యాదవ్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గూగుల్ సంస్థ వైజాగ్ లో స్థాపించడం వెనుక మంత్రి నారా లోకేష్ బాబు నిరంతర కృషి ఉందని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహ యాదవ్ మాట్లాడారు. గూగుల్ సంస్థ వైజాగ్ లో నెలకొల్పడం వలన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయన్నారు. మంత్రి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు , యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం నారా చంద్రబాబునాయుడు కి, మంత్రి నారా లోకేష్ బాబుకి దక్కుతుందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం అంచలంచెలుగా జరుగుతుందని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహంకారానికి అమరావతి నిర్వీర్మైందని బాధపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చంద్రబాబు, లోకేష్ చర్చించడం అభినందనీయమన్నారు. దేశంలో జీఎస్టీ తగ్గడం వలన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గాయని ఆ ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. మంత్రి నారా లోకేష్ బాబు చదువుతో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత లోకేష్ బాబుకి దక్కిందన్నారు. గతంలో నేను తుడా చైర్మన్ గా పని చేసేటప్పుడు శ్రీనివాస మంగాపురం నుండి శ్రీకాళహస్తి వరకు స్వర్ణ ముఖి నది ఇరుపక్కల రివర్ ఫ్రంట్ రోడ్డు ను మాస్టర్ ప్లాన్ లో ఉంచడం జరిగింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు 15 నెలల పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని, ఉచిత బస్సు, పెన్షన్లు పెంచడం కూటమి ప్రభుత్వానికే సాధ్యం అయిందన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి, వైజాగ్ రెండు ప్రాంతాలు రాకెట్ వేగంతో అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యంగెస్ట్ స్టేట్ గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ హైఎస్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ స్టేట్ గా నిలుస్తుంది. యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమించి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. 12 నెలలు పాటు శ్రమించి నేషనల్ పాలసీల్లో కూడా మార్పులు చేయించి 2 లక్షల మందికి ఉపాధి కల్పించి రూ.1.33 పెట్టుబడులు పెట్టే గూగుల్ క్లౌడ్ సంస్థను రాష్ట్రానికి తీసుకు రావడంలో మంత్రి నారా లోకేష్ కృషి అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహ యాదవ్ తో పాటు రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్ర కోటి సదాశివం, గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, టిడిపి నేతలు రవిశంకర్ యాదవ్, చెంగయ్య, శ్రీరాములు, రామారావు పాల్గొన్నారు.