రేణిగుంట ప్రెస్ క్లబ్ న్యూ ఆఫీస్ ప్రారంభం

Sakshitha news

రేణిగుంట ప్రెస్ క్లబ్ న్యూ ఆఫీస్ ప్రారంభం

** ముఖ్య అతిథిగా తుడా చైర్మన్ హాజరు

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రేణిగుంట ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తుడా చైర్మన్ అండ్ టీటీడీ ఎక్స్ అఫిషియో బోర్డు మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రారంభోత్సవ వేడుకలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు దివాకర్ రెడ్డికి సాదరంగా స్వాగతం పలికారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల సేవను చైర్మన్ దివాకర్ ప్రశంసించారు. రేణిగుంట పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, శానిటేషన్, తుడా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి చైర్మన్ మీడియా మిత్రులతో ఆత్మీయంగా చర్చించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి మీడియా కీలక భూమిక పోషిస్తుందని, బాధ్యతతో పనిచేసే జర్నలిస్టులు సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కార్యక్రమానికి హాజరైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, జర్నలిస్టులు, సభ్యులు నూతన కార్యాలయం మరింత సమర్థవంతమైన మీడియా సేవలకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

Scroll to Top