జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ చే ఉచిత పశు వైద్య శిబిరాల పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరణ
ఈనెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాలలో “ఉచిత పశు వైద్య శిబిరాలు” నిర్వహింపబడును. అన్ని మండలాల్లో పశువైద్యాధికారుల సారథ్యంలో రెండు బృందాలను ఏర్పాటుచేసి ఈ శిబిరాలను నిర్వహింపబడును. ఈ ఉచిత పశువైద్య శిబిరాలలో గొర్రెలు, మేకలకు, పెద్ద పశువులకు, లేగ దూడలకు ఉచితంగా నట్టల నిర్మూలన మందులు త్రాపించబడును. గొర్రెలకు బొబ్బ వ్యాధి నిరోధక టీకాలు, కోళ్లలో కొక్కెర తెగులు నివారణ టీకాలు వేయబడతాయి. అనారోగ్య పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వబడును. కావున రైతు సోదరులు ఈ ఉచిత పశువైద్య శిబిరాలలో అందించే పశు వైద్య సేవలు పొందవలసిందిగా కోరడమైనది. జిల్లా కలెక్టర్ ఈ ఉచిత పశు వైద్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఇట్లు
డా. మద్దు హనుమంతరావు
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
