నిస్వార్థ “సేవకు” పురస్కారం
** తిరుపతి మహిళకు గుంటూరులో సన్మానం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతి సమీపంలోని కరకంబాడి తారకరామా నగర్ కేంద్రంగా “శ్రద్ధ” ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న కార్యదర్శి ఎం. విజయలక్ష్మి (ముంతాజ్ బేగం) వృద్ధులకు చేస్తున్న నిస్వార్థ “సేవకు” పురస్కారం దక్కింది. ఆమేరకు గుంటూరుకు చెందిన డా.పట్టాభి కళాపీఠం నిర్వాహకులు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిత్యం వృద్ధులకు అందిస్తున్న శుచికర… నాణ్యవంతమైన భోజనం, ఉండేందుకు మంచాలతో కూడిన వసతి, మనో ఉల్లాసం కోసం టీవీ, అందులో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం, వైద్యసేవలు, ఉచితంగా ఔషదాల పంపిణీ వంటి కార్యక్రమాలను పరిశీలించి ప్రతిభ పురస్కారానికి ఎంపిక చేశారు. ఇందులో భాగంగా కళాపీఠం 15వ వార్షికోత్సవ వేడుక సందర్బంగా తిరుపతి విజయలక్ష్మికి గుంటూరులో సన్మానం నిర్వహించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాపీఠం రాజేంద్రప్రసాద్, నిర్వాహకులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
