కోదాడలో ధరణి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం…. కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు.. ..…..
సాక్షిత : పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటు లోకి తేవడం అభినందనీయం…
నగరాలకు ధీటుగా కోదాడ లో ధరణి వైద్య శాల…
పూర్తి వ్యాపార ధోరణి లో కాకుండా సేవా భావం తో వైద్య శాల లో పేదలకు సేవలు అందించాలి.
నాణ్యమైన వైద్య సేవల తో ధరణి వైద్యశాల పేరు తెచ్చుకోవాలి….. ధరణి హాస్పిటల్ ప్రారంభోత్సవంలో కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటు లోకి తేవడం అభినందనీయం అని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు.
కోదాడ పట్టణంలోని పశువుల సంత బజారులో నూతనంగా నిర్మించిన ధరణి హాస్పిటల్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు.
ఈ కార్య క్రమం లో కౌన్సిలర్ కారింగుల ఉమా అంజన్ గౌడ్, నిర్వాహకులు డాక్టర్ కరుణ శ్రీ, గుజ్జల సాత్విక్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు,ఏటుకూరి రామారావు,బద్దం కృష్ణారెడ్డి పార్ధు ,ప్రసాద్, కొత్తమాసు జనార్ధన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ బొల్లి రాంబాబు, సురేష్ అనుతిష్య డాక్టర్ శ్రీనివాస్, గొండ్రియాల పి ఏ సి ఎస్ మాజీ చైర్మన్ నర్సిరెడ్డి, రాము ట్రాన్స్పోర్ట్, చల్లా సైదయ్య , రావేళ్ళ కృష్ణ ,అఫ్జల్ మాజీ యం పి టి సి శాంతినగర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY