మహదేవపురం డివిజన్‌లో రూ.2 కోట్ల 41 లక్షల 50 వేల రూపాయల వ్యయం

Sakshitha news

మహదేవపురం డివిజన్‌లో రూ.2 కోట్ల 41 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్, : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్కిల్, మహదేవపురం డివిజన్‌లో రూ.2 కోట్ల 41లక్షల 50 వేల రూపాయల వ్యయంతో మంజూరైన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. స్థానిక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహదేవపురం డివిజన్‌లోని షిరిడి హిల్స్‌కు రూ.60 లక్షలు, సాయిగ్రామ్‌కు రూ.22 లక్షలు, బాలయ్య నగర్‌కు రూ.47.50 లక్షలు, కమలమ్మ కాలనీకి రూ.20 లక్షలు మరియు రావి నారాయణరెడ్డి నగర్‌కు రూ.92 లక్షలతో మొత్తం రూ.2 కోట్ల41 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం శుభపరిణామమని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు కృషి ఫలితంగానే ఈ భారీ నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. రోడ్ల సౌకర్యం లేక కాలనీవాసులు ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వర్షాకాలంలో వరద నీరు కాలనీల్లో నిలిచిపోవడంతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణంతో స్థానిక ప్రజల ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మరో 50 కోట్ల నిధులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అతి తొందరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన ప్రకటించారు..

అలాగే గత బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) ప్రభుత్వ హయాంలో మహదేవపురం డివిజన్‌కు ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి నిధులు కేటాయించలేదని, స్థానిక సమస్యలను పరిష్కరించడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు…

అదేవిధంగా సర్ కార్యక్రమాన్ని ఆగస్టు 10వ తారీఖు వరకు పొడిగించిన నేపథ్యంలో తమ వివరాలను సమర్పించని వారు బిఎల్ఓ లకు అందజేయాలని స్థానికులను సూచించారు..

రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలో కృషి చేసిన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌ గారికి కు వివిధ కాలనీలకు చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ తో పాటు టిపిసిసి మాజీ కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బుచ్చిరెడ్డి, దుగ్యాల ప్రసాద్, షిరిడి హిల్స్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ గారు,సత్య గారు,సాయి గ్రామ్ కాలనీ కార్యదర్శులు చంద్రశేఖర్ గారు,బాలయ్య నగర్ గంగారాం,కమలమ్మ కాలనీ అధ్యక్ష కార్యదర్శులు రమణ రెడ్డి గారు, ప్రసాద్, రావినారాయణ రెడ్డి నగర్ వాసులు వీరయ్య, అంజి ముదిరాజ్, యం సాగర్ , రషీద్ బేగ్, యాదవరావు, దంపనబోయిన శ్రీనివాస్, యశ్వంత్ రెడ్డి, లాల్ మొహమ్మద్, మహమ్మద్ తోఫిక్, డాన్ శీను మరియు వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top