కంటి చూపు లేకుంటే అన్నీ సమస్యలే : ప్రత్తిపాటి
- ప్రత్తిపాటి ఫౌండేషన్ ప్రజల ఆరోగ్య రక్షణలో ఎల్లప్పుడూ ముందే ఉంటుంది.
- 38 వ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
వృద్ధుల్ని తమ బిడ్డలు, కుటుంబసభ్యులు ప్రేమ, గౌరవంతో చూస్తారనే ప్రభుత్వం వారికి ఠంఛన్ గా ఒకటో తేదీన పింఛన్లు అందిస్తోందని, వయసు పైబడినవారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, దూరం వెళ్లి వైద్యసేవలు పొందలేరనే ప్రత్తిపాటి ఫౌండేషన్ పలు రకాల వైద్య శిబిరాలు ఉచితంగా నిర్వహిస్తోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని 28వ వార్డులో ప్రత్తిపాటి ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సంయుక్త సహకారంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రత్తిపాటి సోమవారం ప్రారంభించి మాట్లాడారు.
వినికిడి సంబంధిత సమస్యలున్నవారికి 7న ఉచిత వైద్య శిబిరం
కంటి చూపు సరిగా లేకుంటే ఎన్నో అవస్థలు పడాలని, ఒకరిపై ఆధారపడే వయసులో ఉన్న వృద్ధులు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారని ప్రత్తిపాటి చెప్పారు. పేదలకు ఉచిత వైద్యసేవలు అందించే సంస్థలకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయన్న ప్రత్తిపాటి.. శంకర కంటి ఆసుపత్రి వారు పేదలకు అందించే వైద్యసేవల్లో కూటమిప్రభుత్వ సహకారం కూడా ఉందన్నారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 38వ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటిసంబంధిత సమస్యలతో బాధపడేవారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రత్తిపాటి ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుం దన్నారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలపై టీడీపీ శ్రేణులు ప్రజలక విస్తృత అవగాహన కల్పించా లని, వార్డు, బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జ్ లు ప్రజల అనారోగ్య సమస్యల్ని గుర్తించి, ఫౌండేషన్ వైద్య శిబిరాలకు వారిని చేర్చాలన్నారు. 7వ తేదీన వినికిడి (చెవిటి, మూగ) సంబంధిత సమస్యలున్న వారికి ప్రత్తిపాటి గార్డెన్స్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత సమస్య ఉన్నవారికి ఉచితంగా వినికిడి మిషన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, షేక్ మస్తాన్ వలి, శంకర్ కంటి ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాసరావు, ఫౌండేషన్ నిర్వాహకులు కంచర్ల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY