గెలిచినపుడు వినయాన్ని పెంచుకోవాలి

Sakshitha news

గెలిచినపుడు వినయాన్ని పెంచుకోవాలి

** నారాయణ విద్యాసంస్థల జోనల్ మీట్ లో “తుడ” చైర్మన్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ఎవ్వరైనా గెలిచినపుడు వినయాన్ని….
ఓడినప్పుడు పట్టుదలను పెంచుకోవడం ద్వారా మానసిక పరిపూర్ణత కలుగుతుందని, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నాయకత్వ లక్షణాలు తెలుస్తాయని “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. నారాయణ విద్యాసంస్థల అధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న నారాయణ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుడా చైర్మన్ అండ్ టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన 30 బ్రాంచ్ ల నుంచి దాదాపు 10 వేల మంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా దివాకర్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి, శాంతి కపోతం ఎగరేసి, జాతీయ జెండా ఆవిష్కరించి పోటీలను ప్రారంభం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “దాదాపు 30 పైగా శాఖల నుంచి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు
ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నారాయణ విద్యాసంస్థలకు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.


ఇలాంటి పోటీల ద్వారా
ఉత్సాహం, క్రీడా స్పూర్తి కనిపిస్తుందని తెలిపారు.
ముఖ్యంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో పోటీతత్వం, క్రీడా స్పూర్తి పెరిగి, తద్వారా మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు. ఈ పోటీలు కేవలం విద్యార్థులలో పోటీ కోసమే కాకుండా ఐక్యత, సమైక్యతకు నిదర్శనం అని తెలిపారు. ప్రతి విద్యార్థికి జీవితంలో చదువు ఎంత ముఖ్యమో, క్రీడలు కూడా అంతే ముఖ్యం. అందులో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, కోకో వంటివి మానసిక ఉల్లాసాన్ని నింపుతాయని తెలిపారు.

ప్రతి క్రీడాకారుడు మైదానంలో ఎదుర్కొనే ఒత్తిడి, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతికూల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పునాది అని అభిప్రాయపడ్డారు. చివరగా తుడా చైర్మన్ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు తుడా చైర్మన్ తో ఫోటోలు, కరచాలనం కోసం పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో డాలర్స్ దివాకర్ రెడ్డితో పాటు సినీ నటుడు శ్రీకాంత్, నారాయణ విద్యాసంస్థల అధికారులు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top