హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఏ ఎస్ రాజు నగర్ కాలనీ లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి భారీ వృక్షం

Sakshitha news

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఏ ఎస్ రాజు నగర్ కాలనీ లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి భారీ వృక్షం నెలకొంటుందని తెలియపర్చగా, తక్షణమే స్పందించి జిహెచ్ఎంసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారితో క్రేన్ తెప్పించి దగ్గర ఉండి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, తక్షణమే స్పందించి జిహెచ్ఎంసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారితో క్రేన్ తెప్పించి దగ్గర ఉండి పనులను పర్యవేక్షితున్నట్లు చెప్పడం జరిగింది, అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు. ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని,  అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దాసు, ఎలక్ట్రికల్ లైన్మెన్ కాలి, కాలనీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top