587 ఓట్ల మెజార్టీతో గెలిచిన టంగటూరు గ్రామ సర్పంచ్ బద్ధం హరిత కృష్ణారెడ్డి

Sakshitha news

587 ఓట్ల మెజార్టీతో గెలిచిన టంగటూరు గ్రామ సర్పంచ్ బద్ధం హరిత కృష్ణారెడ్డి
సాక్షిత శంకర్‌పల్లి:

శంకర్‌పల్లి మండలంలోని టంగటూరు గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన బద్దం హరిత కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిపై 587 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ బద్దం హరిత కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో సమస్యలను అన్నింటిని విడతలవారీగా పరిష్కరిస్తానని గ్రామస్థుల సమక్షంలో హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. నూతన సర్పంచుకు కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు.

Scroll to Top