ఘనంగా జాతీయ పెన్షనర్ల దినోత్సవం..విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య…
నకారా సేవలు చిరస్మరణీయం.
పెన్షనర్లు సామాజిక సేవలో ముందుండాలి.
విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య.
విశ్రాంత ఉద్యోగులు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవంగా జీవించేందుకు నకారా చేసిన కృషి చిరస్మరణీయమని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ళ సీతారామయ్య అన్నారు. శనివారం జాతీయ పెన్షనర్ల దినోత్సవంను పురస్కరించుకొని కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
పెన్షన్ బిక్ష కాదు అది ఉద్యోగుల హక్కు అని సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులు పెన్షన్ లేకపోవడం సరి కాదని భావించి తన బాధ్యతగా కర్తవ్యం గా న్యాయస్థానానికి వెళ్లి పెన్షన్ తీసుకువచ్చేందుకు నకారా ఎనలేని కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లకు ప్రాధాన్యత తగ్గించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఈ సందర్భంగా 70 సంవత్సరాల నుండి నా పెన్షనర్లతో పాటు సంఘ భవనానికి సంఘ అభివృద్ధికి ఆర్థిక సహాయం అందజేసిన సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, పొట్ట జగన్మోహన్ రావు, హమీద్ ఖాన్, విద్యాసాగర్ రఘువర ప్రసాద్, వీరబాబు, హాజీ నాయక్, ఎస్ దాని, భ్రమరాంబ, శోభ, అమృత రెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
