చేతి రాత విద్యార్థుల జీవితంపై ప్రభావం చూపుతుంది……..
సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులుపలుస శంకర్ గౌడ్
సాక్షిత వనపర్తి
విద్యార్థుల అందమైన చేతిరాత వారి భావి జీవితంపై చక్కని ప్రభావం చూపుతుందని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిజనవాడ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ కోరిక మేరకు న్యూ స్కిల్ అకాడమీ తరుణ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక రోజు ఉచిత చేతిరాత శిక్షణ కార్యక్రమం లో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్నారు .
ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ పిల్లల అందమైన చేతిరాత వారిలో క్రమ శిక్షణను,ఏకాగ్రతను, తప్పులు లేకుండా రాసే చిత్తశుద్ధిని అలవాటు చేస్తుందన్న పరిశోధకుల అభిప్రాయాన్ని గుర్తు చేశారు.చక్కని చేతిరాత విద్యార్థులకు మంచి మార్కులను,గురువుల అభిమానాన్ని పొందేలా చేస్తుందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. హరిజనవాడ గెజిటెడ్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ తమ పిల్లలను ఈ వైపుగా ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన తెలిపారు పాఠశాలల తరుపున తరుణ్ మాస్టర్ని ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ , మరియు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో చేతిరాత శిక్షణ నిపుణులు తరుణ్ మాస్టర్, సహాయకులు మీనా,పాఠశాల ఉపాధ్యాయులు రవి కుమార్, అరవింద్,విజయ్ కుమార్, రుక్ముద్దీన్, రంగనాయకమ్మ, నాగరాజు, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
