కోదాడలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు..
సాక్షిత : తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఐటీ రంగానికి చంద్రబాబు చేసిన సేవలను కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పేదలకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లు నర్సయ్య, గుళ్ళపల్లి సురేష్, కొత్త బ్రహ్మయ్య, కోదాటి గురవయ్య, పిట్టల శోభన్ బాబు,ఏటుకూరు సురేష్, కోదాడ రేవంత్ రెడ్డి, కొత్త నరేష్ రెడ్డి, వనపర్తి నాగేశ్వరరావు, మైకు నాగులు, హరినాథ్, బండారు అనిల్,అమర్నాథ్, కనగాలవీరబాబు, కనగాల రవి, బత్తిన రవీందర్, థామస్, శివ, జవ్వజి, నరేష్, ప్రవీణ్, మురళి,సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY