ప్రజాసమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాలు గద్దె దిగాలి.

Sakshitha news

ప్రజాసమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాలు గద్దె దిగాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వర పిలుపు.

భారతదేశ వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారని ఆ సమస్యలను కేంద్ర ప్రభుత్వం తీర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నందున కేంద్రంలో ప్రభుత్వ మార్పును కోరుతూ సిపిఐ ప్రచార యాత్రలను నేడు కుత్బుల్లాపూర్ మండలంలోని జగద్గిరిగుట్టలో ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏసు రత్నలు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నిత్యవసర వస్తువుల ధరల పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అంతర్జాతీయంగా చమరుదరలు తగ్గినప్పటికీ ఇక్కడ చమర ధరలు తగ్గించకుండా పేద ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపుతున్నారని, అలాగే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగం కల్పిస్తామని హామీలు ఇచ్చి ఉన్న ఉద్యోగాలను తొలగించి ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారని విమర్శించారు. ప్రజా సమస్యల కోసం పోరాడే వారిని ప్రశ్నిస్తున్న వారిని ద్రోహులుగా చిత్రీకరించడం తప్పించి ప్రజలకు సమస్యలను ఎక్కడా పరిష్కరించట్లేదని ఎక్కడైనా తిరుగుబాటు వస్తే అక్కడ మతం, దేవుడు పేరుతోటి రాజకీయం తప్పిస్తే ప్రజలకు అవసరమైనటువంటి వాటిని తీర్చలేదని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వస్తే 15 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చి 15 లక్షల మాటేమో గానీ ప్రజల దగ్గర నుంచి టాక్స్ ల పేరుతో ప్రతి వ్యక్తి దగ్గర సంవత్సరానికి సుమారు ఒక లక్ష వసూలు చేస్తున్నారని దానివల్ల ఇప్పటికే బిజెపి ప్రభుత్వానికి ప్రజలే 15 లక్షలు కట్టినట్లు కనిపిస్తుందని అయినప్పటికీ ప్రజల కోసం పనిచేయకుండా గత 70 సంవత్సరాల నుంచి లేని అప్పును బిజెపి ప్రభుత్వం వచ్చినంక 100 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలను మోసం చేసింది అని అన్నారు. బిజెపి ప్రభుత్వంలో కేవలం ఆదాని, అంబానీ లాంటి వ్యాపారవేత్తలే లాభపడ్డారు తప్పిస్తే ప్రజలు మాత్రం నష్టపోయారని అన్నారు.

అందుకే దేశంలో మార్పు రావాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం జగద్గిరిగుట్ట సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద ప్రారంభమై దేవమ్మ బస్తి బీరప్ప నగర్ లో ప్రచారం నిర్వహించి ముగించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు హరినాథ్ రావు, రాములు మహిళా సమైక్య అధ్యక్షురాలు హైమావతి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ సభ్యులు నరసింహారెడ్డి ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు యువజన నాయకులు కీర్తి, శ్రీకాంత్, వంశీ సిపిఐ నాయకులు నరసయ్య, బక్కరి మల్లేష్, శ్రీనివాస్ చారి, నగేష్ చారి, బాల నర్సయ్య, సాగర్, దీప,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top