క్రైస్తవ మైనారిటీల స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయూత…
వివిధ ఉపాధి పథకాల కోసం దరఖాస్తుల ఆహ్వానం…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, తెలంగాణ క్రైస్తవ మైనారిటీల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి క్రైస్తవ మైనారిటీలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో కుట్టు యంత్రాలు, చిరు వ్యాపారాలు, విద్యుత్ ద్విచక్ర వాహనాలు, విద్యుత్ స్కూటర్లు, మోటారు ద్విచక్ర వాహనాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి తెలిపారు.
కుట్టు యంత్రాలు, చిరు వ్యాపార యూనిట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. విద్యుత్ ద్విచక్ర వాహనాలు, విద్యుత్ స్కూటర్లు, మోటారు ద్విచక్ర వాహనాల కోసం 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ.1.50 లక్షలకు మించరాదు.
అర్హులైన క్రైస్తవ మైనారిటీ అభ్యర్థులు జూలై 3 నుంచి జూలై 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలను ఆన్లైన్ దరఖాస్తుల పోర్టల్ లో సందర్శించాలని, అలాగే 040-23391067 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అర్హత కలిగిన క్రైస్తవ మైనారిటీలు ఈ ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
