నల్లబెల్లి గ్రామంలో ఘనంగా గోదారంగనాయకుల స్వామి వారి కళ్యాణం మహోత్సవం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో భోగి పండుగ రోజున గోదా రంగనాయక స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని
ప్రధాన అర్చకులు వెంకటరత్నమాచార్యులు
, విక్రమాచార్యులు, మరియు నాగేంద్ర చార్యులు వేదమంత్రాలు స్తుతులతో కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో వందల సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్నటువంటి కర్నాల కుటుంబీకులైన వారు గోదామాత దేవి కి పట్టు వస్త్రాలు సమర్పించి తలంబ్రాలు తో ఘనంగా కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ హాజరై స్వామివారి దివ్య ఆశీస్సులను పొందడం జరిగింది. గ్రామంలోని కర్నాల కుటుంబకులు వారి వంశపార్యపరామంగా చేస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవం గ్రామంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా హట్టహాసంగా నిర్వహించాలని కోరారు. ఇంత మంచి కళ్యాణ మహోత్సవం మండలంలో మన గ్రామంలో నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు సిరువోలు సత్యనారాయణరావు, కొండలరావు, శ్రీనాథరావు, బుచ్చిబాబు, రాధాకృష్ణ, వెంకటేశ్వరరావు, పులసాని దేవేందర్రావు, దుగ్యాల కిషన్ రావు,ఎల్లబోయిన సదానందం,ఆకారపు వెంకటేశ్వర్లు, తక్కలపల్లి శ్రీకాంత్ రావు, బొమ్మెర శ్రీనివాస్, చిట్టి మల్ల వెంకటేశ్వర్లు , ప్రవీణ్, రాజు,మహిళలు భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడం జరిగింది

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
