డ్రగ్స్ మహమ్మారికి జీవితాన్ని తాకట్టు పెట్టొద్దు

Sakshitha news

డ్రగ్స్ మహమ్మారికి జీవితాన్ని తాకట్టు పెట్టొద్దు

మారకద్రవ్యాలు విక్రయించిన వినియోగించిన కఠిన శిక్షలు తప్పవు…….
జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని

సాక్షిత వనపర్తి :
డ్రగ్స్ మహమ్మారికి జీవితాన్ని తాకట్టు పెట్టొద్దు అని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని అన్నారు. నల్సా – డ్రగ్ అవేర్‌నెస్ అండ్ వెల్‌నెస్ నావిగేషన్ – డ్రగ్ ఫ్రీ ఇండియా)- పథకం, 2025 లో భాగంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏదుట్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ మాదాకద్రవ్యాలను అమ్మిన, విక్రయించిన మరియు వినియోగించిన చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలు అవుతాయని తెలిపారు.

మాదకద్రవ్యాలపై ఉన్న అపోహలను నమ్మి వాటిని తీసుకొని అనారోగ్యాల బారిన పడవద్దని తెలిపారు. అదేవిధంగా బాల్యవివాహాల నిర్మూలన చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం మరియు ఫోక్సో యాక్ట్ గురించి వివరించారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలలో ఉత్తమ ఫలితాలను పొందడానికి కావలసిన సూచనలను సలహాలను తెలియజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Scroll to Top