సర్కార్ బాక్స్ క్రికెట్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం సర్కిల్ పరిధిలో ఎలిగేన్స్ అపార్ట్మెంట్ మెట్కన్ గూడ నందు ఏర్పాటుచేసిన ద సర్కార్ బాక్స్ క్రికెట్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజక వర్గ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ .
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ యువత చెడుదారిని పడకుండా క్రీడలు దోహద పడుతాయని అన్నారు. అనంతరం బాక్స్ క్రికెట్ నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బుచ్చిరెడ్డి, కృష్ణ యాదవ్, అంజి ముదిరాజ్, భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మౌనిష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి, బాక్స్ క్రికెట్ నిర్వహకులు ప్రేమ్ సాయి, వినయ్ కుమార్, కౌశిక్, రాకేష్ రెడ్డి, శ్రీనివాస్, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
