మల్కాజిగిరిలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు

Sakshitha news

మల్కాజిగిరిలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు. మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని ఆనంద్ బాగ్ రామచంద్ర సి సి పిఎల్ దగ్గర మల్కాజ్గిరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి ఎన్ వి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని భారీ కేకును కట్ చేసిన మైనంపల్లి వాణి. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి ఎన్ వి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సుమారుగా 2000 మందికి అన్నదానం చేసాము. ఈ సందర్భంగా పాల్గొన్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు డివిజన్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షు డు మహిళా సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top