టీడీపీ నేత శుభస్వీకరణలో మాజీ ఎమ్మెల్యే

Sakshitha news

టీడీపీ నేత శుభస్వీకరణలో మాజీ ఎమ్మెల్యే

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి అండ్ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేజర్ల మనోహరాచారి ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఆయనకు తిరుపతిలోని సుందరయ్యనగర్ స్వగృహంలో శుభ స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఇందుకు హాజరైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే అండ్ ఏపీ గ్రీనరీ – బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ మన్నూరు సుగుణమ్మ చేజర్ల మనోహరాచారి చిత్రపటానికి పుష్పాంజలితో నివాళు లర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుజాతమ్మ, అశోక్, హేమలత, మునిశేఖర్ రాయల్, ఆర్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top