BRIG మున్సిపల్ హై స్కూల్, చిలకలూరిపేటలో ఘనంగా జరిగిన ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుక

Sakshitha news

BRIG మున్సిపల్ హై స్కూల్, చిలకలూరిపేటలో ఘనంగా జరిగిన ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుక…

సాక్షిత : స్థానిక పండరీపురం లోని భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ హై స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది అందరూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల పదవ తరగతి విద్యార్థుల నాయకత్వంలో నిర్వహించబడిన సభ వందేమాతరం తో ప్రారంభమైంది. ఈ సభకు అధ్యక్షులుగా వ్యవహరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గేరా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తులలో పవిత్రమైనదని, ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల మధ్య అనుబంధం, తల్లిదండ్రులు బిడ్డల పట్ల చూపించే ప్రేమ వలే పరస్పరం నిర్మలమైనదని , విద్యార్థులు క్రమశిక్షణతో ఎదిగి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఎల్లప్పుడూ కోరుకునే వ్యక్తే ఉపాధ్యాయుడని ఉపాధ్యాయుని గొప్పతనాన్ని వివరించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయురాలు విద్యార్థులందరూ గురువులను మించిన గొప్ప స్థానాలను అధిరోహించి తల్లిదండ్రులకు, పాఠశాలకు గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ సభలో సీనియర్ ఉపాధ్యాయులైన కొండపర్ల మేరీగ్రేస్, మర్రి స్వరూప రాణి మరియు షేక్ మహమ్మద్ అలీ లను ఘనంగా సత్కరించారు. చివరికి జనగణమన ప్రార్థనా గీతంతో సభ విజయవంతంగా ముగిసింది.