ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన మాజీమంత్రి
చెన్నుపాటి ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యసేవలు అందించాలన్న బృహత్ లక్ష్యంతో నాదెండ్ల మండలం తూబాడులో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం ప్రత్తిపాటి రోగులతో మాట్లాడారు.
వైద్యులతో మాట్లాడిన ప్రత్తిపాటి.. పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించి, చెన్నుపాటి సంస్థ పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సూచించారు.
కార్యక్రమంలో మాజీ జిడిసిసి బ్యాంకు చైర్మన్ మానం వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, టీడీపీ నాయకులు నల్లమోతు హరిబాబు, దగ్గుమల్లి సాంబశివరావు, హరిగోపాల్, వెంకటేశ్వర్లు, యాసిన్, డాక్టరులు ఆకుల శివ ప్రసాద్, జి.జ్ఞానేశ్వరి, యనమదల శ్రీ హర్ష, గార్లపాటి శివ శంకర్, సి.హెచ్ రాధిప్రియ, చెన్నుపాటి ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
