గణపతి నవరాత్రుల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్లు, మాజీ కో ఆప్షన్ సభ్యలు, సన్మానిస్తున్న నిర్వాహకులు
గణపతి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ టెంపుల్ బస్ స్టాప్ అచటెస్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,నిజాంపేట్ అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు కోలన్ సునీల్ రెడ్డి, ఆవుల జగన్ యాదవ్, మాజీ కో ఆప్షన్ సభ్యలు తల్లారి వీరేష్, అన్నదాతలు శ్రీమతి కోలన్ లక్ష్మి నరసమ్మ, శ్రీ కోలన్ యాదిరెడ్డి పుణ్య దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో అచటెస్ యూత్ అసోసియేషన్ సభ్యలు స్థానిక ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
