యూరియా కొరతపై బిఆర్ఎస్ నాయకుల మెరుపు ధర్నా!
హైదరాబాద్:
వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మెరుపు ధర్నా నిర్వహిం చారు. యూరియా కొరతపై ప్రభుత్వం స్పందించి ఇప్పటిలోగా పంపిణీ చేస్తారో చెప్పాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.రాష్ట్రంలో యూరియా కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు.
అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్‌కు ర్యాలీగా వెళ్లారు. వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ తరువాత అగ్రికల్చర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కేటీఆర్, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ వాయిదా అనంతరం హరీశ్ రావు, కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి అసెంబ్లీ ఆవరణం నుంచి వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి యూరి యా కొరతను నిరసిస్తూ ర్యాలీగా వెళ్లారు. యూరి యా కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం బయటకుకొచ్చి యూరి కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు, నేతలు ఆందోళనకు దిగారు.యూరియా కొరత ఎప్పుడు తీరుతుంది.. రైతులకు పూర్తిస్థాయిలో యూరియా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఇక్కడినుంచి కదలబోమని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.
ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు రోడ్లెక్కి ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఆందోళన ఉధృతం కావడం తో పోలీసులు జోక్యం చేసు కొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావులతో పాటు పలువురిని అదుపు లోకి తీసుకున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
