రైతులు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి…. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రసీదులు తీసుకోవాలి ,న్యాయ సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచన
సాక్షిత వనపర్తి నవంబర్ 22
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి వి. రజని ఆదేశాలను సారం శనివారం వనపర్తి జిల్లా పెద్దగూడెం తాండా ప్రాంగణంలోని అడవి లో చెట్లను నాటుతున్న వ్యవసాయదారులకు మరియు కూలీలకు చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలని. విత్తనాలను కొనుగోలు చేసినప్పుడు రసీదులను కచ్చితంగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉచిత న్యాయ సలహాల కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలిపారు. మహిళలకు, చిన్నపిల్లలకు, షెడ్యూల్ కులము, షెడ్యూల్ తెగలకు, మతిస్థిమితం లేనివారికి, వికలాంగులకు, మరియు మూడు లక్షల లోపు సంవత్సర ఆదాయం కలిగిన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య , అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ రఘు మరియు శ్రీదేవి పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
