అకాల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి.
ఐకెపి కేంద్రాలలో నిర్వాహకులు రైతులకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యపు రాశులపై రెండు రోజులు పాటు టార్పలిన్ పట్టాలు కప్పే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ నిర్వాహకులను ఆదేశించారు. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం, ఎన్ డి సి ఎం ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే అర్వపల్లి, వేల్పుచర్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మెంథా తుఫాన్ ప్రభావం జిల్లాలో ఉన్నందున రెండు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి పొలాలు కోయకుండా రైతులు సహకరించాలని, అలాగే ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యపు రాశులపై నిర్వాహకులు టార్పాలిన్ పట్టాలు ఉంచాలని సూచించారు. డి ఎస్ ఓ మోహన్ బాబు, డి ఎం రాము, తహసీల్దార్ శ్రీకాంత్,ఏ ఎస్ ఓ శ్రీనివాస్ రెడ్డి,ఆర్ ఐ శ్రీకాంత్ రెడ్డి, ఏ ఓ గణేష్, ఎ ఈ ఓ సత్యం, ఏ పి ఎం రాంబాబు, సెంటర్ ఇంచార్జి విజయ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
