చంద్రన్న పాలనలో రైతులు, అన్నదాతలు సంతోషంగా వున్నారు

Sakshitha news

చంద్రన్న పాలనలో రైతులు, అన్నదాతలు సంతోషంగా వున్నారు

సాక్షిత : వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

కోవూరు మండలం పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో జరిగిన పడుగుపాడు, ముదువర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల ప్రమాణ స్వీకారంలో ప్రశాంతమ్మకు రైతులు, నాయకులు సొసైటీ అధికారులు స్వాగతం పలికారు. కో ఆపరేటివ్ అధికారుల సమక్షంలో పడుగుపాడు సొసైటి ఛైర్మెన్ గా నాగారెడ్డి శ్యాం సుందర్ రెడ్డి, డైరెక్టర్లుగా నర్రా శ్రీనివాసరావు, నాగిరెడ్డి జయశంకర్ ముదివర్తి సొసైటి ఛైర్మెన్ గా తన్నీరు రాజయ్య, డైరెక్టర్లుగా బాడుగ మస్తానయ్య, వరికొండ సుబారావు చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో వుంచుకొని అన్నదాత సుఖీభవ పధకం ద్వారా ఆర్ధిక చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని కొనియాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. గత రబీ సీజన్ లో ధాన్య సేకరణ చేసిన 24 గంటలలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్టుగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూడా రైతుల నుంచి ధాన్య సేకరణ చేయాలని మంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు. ముదివర్తి, పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మెన్లు మరియు డైరెక్టర్లుగా సేవాభావం కలిగిన వ్యక్తులను నియమించామన్నారు. విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి అన్నదాతల ఆదుకునే బాధ్యత సహకార సంఘాల పై వుందన్న విషయాన్ని ప్రశాంతమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పెన్నాడెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, కోవూరు తహసీల్దారు సుబ్బయ్య, టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, టిడిపి కోవూరుమండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ యాకసిరి విజయ, జొన్నవాడ ఆలయ ఛైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, సొసైటీ సీఈవో గోవర్ధన్ రెడ్డి, టిడిపి నాయకులు కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, విన్నకోట రాఖి, బత్తుల రమేష్, తిరుపతిరెడ్డి, పాలూరు వెంకటేశ్వర్లు, షేక్. ఫిరోజ్, షేక్. జమీర్, షేక్. జహంగీర్, బాల రవి, నాటక రాణి వెంకట్, యద్దలపూడి నాగరాజు, పిచ్చుక మధు, గాదరాజ అశోక్, జనసేన నాయకుడు చప్పిడి శ్రీనివాసరెడ్డి, బిజెపి నాయకులు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.