పూటకో కట్టుకథ.. రోజుకో తప్పుడు కథనం. ..ఇదే జగన్ దినచర్య : ప్రత్తిపాటి
- ప్రజలు మర్చిపోలేని విధంగా బుద్ధిచెప్పినా.. జగన్ లోని దుష్ప్రచార.. పరనింద స్వభావం పోలేదు.
- గత ఎన్నికల్లో ప్రజలు జగన్ ను… వైసీపీని వార్నింగ్ బెల్ తో హెచ్చరించారు. తమ వైఖరి.. ఆలోచనావిధానం మార్చుకోకుంటే ఈసారి ఏకంగా డెత్ బెల్ మోగిస్తారు
“ కూటమిప్రభుత్వ రాకడ.. చంద్రబాబు పాలనా నిలకడతో జగన్ .. వైసీపీనేతలు నిత్యక్షోభతో అల్లాడిపోతున్నారు. తమలోని అక్కసు… అసూయ… అహంకారాన్ని బహిరంగపరిచే క్రమంలో ప్రభుత్వాన్ని..చంద్రబాబుని ఎలా బదనాం చేయాలన్న ఆలోచనలతో తమలో తామే రగిలిపోతున్నారు. ఆ క్రమంలోనే పూటకో కట్టుకథ… రోజుకో తప్పుడుకథనంతో తమ అనుబంధ మరియు అవినీతిమీడియాలో విషప్రచారం చేయిస్తున్నారు. ఐదేళ్ల వైసీపీప్రభుత్వ అరాచకపాలనతో విసిగివేసారిన ప్రజలు గత ఎన్నికల్లో చావుదెబ్బకొట్టినా జగన్ అతని అనుమాయుల్లో మార్పురాలేదు. వారి ఆలోచనా విధానం చూస్తుంటే ఇక ఎప్పటికీ రాదనే అనుకోవాలి. గత ఎన్నికల్లో ప్రజలు ఒక వార్నింగ్ బెల్ తో హెచ్చరించారు.. అయినా పంథా మార్చుకోకుంటే వైసీపీకి.. జగన్ కు శాశ్వతంగా డెత్ బెల్ మోగిస్తారు. చింతచచ్చినా పులుపు చావదన్నట్టు.. ప్రజలు మర్చిపోలేని పరాభవంతో బుద్ధిచెప్పినా..పరనింద, దుష్ప్రచారం చేసే బుద్ధిమాత్రం జగన్ నుంచి పోలేదు.
అమరావతి నిర్మాణ పురోగతిని జగన్ భరించలేకపోతున్నాడు
అసత్యాలు.. అబద్ధాల్లో నుంచి పుట్టిన వైసీపీ నుంచి నిజాలు వస్తాయనుకోవడం అత్యాశే అవుతుంది. కూటమిప్రభుత్వంలో చంద్రబాబు మార్గనిర్దేశకత్వంలో మరలా అమరావతి పనులు ఊపందుకోవడం.. రాజధానిలో రేయింబవళ్లు విరామం లేకుండా నిర్మాణపనులు కొనసాగడాన్ని జగన్.. ఆయన అనుబంధ.. అవినీతి మీడియా భరించలేకపోతోంది. ప్రజలు సంతోషంగా ఉండటాన్నే భరించలేని జగన్.. పదికాలాలపాటు నిలిచే రాజధాని నిర్మాణమవడాన్ని హర్షిస్తాడా? అందుకే నిత్యం కళ్లలో నిప్పులు పోసుకుంటూ.. తన పేటీఎమ్ బ్యాచ్ తో సోషల్ మీడియాలో.. తన అవినీతి నాయకులతో అవినీతిమీడియాలో అమరావతిపై విషప్రచారం ప్రారంభించాడు. దేశంలో ఎక్కడ నీరు నిలబడినా..అది అమరావతిలోనే అన్నట్టు.. ఎక్కడ వరద వచ్చినా అది విజయవాడ చుట్టుపక్కలే వచ్చినట్టు.. కట్టుకథలు అల్లుతున్నాడు. మొన్నటికి మొన్న పులివెందులలో టీడీపీ రిగ్గిoగ్ చేసిందoటూ, ఎక్కడో పశ్చిమ బెంగాల్ లో జరిగిన పోలింగ్ వీడియోతో దుష్ప్రచారం చేశారు.
సెట్లు …సెట్టింగ్ లు వేసుకునే వారికి నిజమైన అభివృద్ధి మింగుడుపడదు
జగన్ ఎంతగా కొట్టుకులాడి…. చేతిలో అవినీతిపత్రిక.. టీవీ ఉన్నాయని బరితెగించి పరనిందలతో దుష్ప్రచారానికి పాల్పడితే మరోసారి ప్రజాగ్రహం చవిచూడక తప్పదు. గుడికి వెళ్లలేక ఇంట్లో వేంకటేశ్వరస్వామి గుడి సెట్టు… ప్రాజెక్టులు కట్టలేక హంద్రీనీవా కాలువలో నీళ్ల సెట్టింగులు వేసిన వారికి ప్రజలు మెచ్చే అభివృద్ధి ఎప్పటికీ మింగుడుపడదు.
అమరావతి మునిగిందని, పోలవరం పనుల్లో నాణ్యతలేదని.. రాజధాని నిర్మాణంలో అవినీతని..హామీలు అమలుకాలేదని.. మహిళలకు బస్సులు లేవని.. పనిగట్టుకొని చేసే నిరాధార ఆరోపణలు, విద్వేషంతో కూడిన విషప్రచారం ఎప్పటికైనా తనకే ప్రమాదమని జగన్ గ్రహిస్తే మంచిది.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో సూచించారు.
