ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలి

Sakshitha news

ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలి..

కోదాడ: (సాక్షిత):
కోదాడ మండల పరిధిలోని కొమరబండ గ్రామంలో రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు,గ్రామస్థులకు రోడ్డు భద్రతపై అరైవ్ అండ్ అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కోదాడ రూరల్ సబ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను ఖచ్చితంగా పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని పిలుపునిచ్చారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ప్రయాణాల్లో హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాణరక్షణ కవచాల్లా పనిచేస్తాయని పేర్కొన్నారు. మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ట్రిపుల్ రైడింగ్ వంటి చట్టవిరుద్ధమైన పనులకు దూరంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది,గ్రామ పెద్దలు,వాహనదారులు పాల్గొన్నారు.

Scroll to Top