అమెరికా , ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలి…ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు….*మార్చి 15:(సాక్షిత)
పెట్రోల్ నిల్వలను దోచుకునేందుకు అమెరికా ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు
ఆదివారం కోదాడలోని ఎమ్మెస్ కళాశాల ప్రాంగణంలో అమెరికా ఇజ్రాయిల్ తో కలసి ఇరాన్ పై జరుపుతున్న సంయుక్త దాడి నేపథ్యం. భారత దేశ ఆర్థిక వ్యవస్థ పై దాని ప్రభావం. అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ..ఇరాన్లో అను ఆయుధాలు తయారు చేస్తున్నార నే అభియోగంతో దాడి చేసి అకారణంగా పాఠశాలలు ఆసుపత్రులపై దాడి చేసి పసిపిల్లలను, సాధారణ ప్రజలను చంపటం దుర్మార్గమన్నారు .
ఆపరేషన్ ఎపిక్యూరీ ఆపరేషన్ మిడ్ నైట్ ల పేరుతో రెండు దేశాలు ఇరాన్ సార్వభౌమత్యాన్ని దెబ్బతీయటం, విధ్వంసం చేయడం ఆయిల్ వంటి నిక్షేపాలను తమ దేశానికి తరలించకు పోయి ఇరాన్ లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చేస్తున్న కుట్రలో భాగమే యుద్ధం అన్నారు. రెండు దేశాల దాడుల ఫలితంగా ఇరాన్ హోర్మోజ్ జల సంధి ని మూసి వేయడం జరిగిందని, దీంతోభారతదేశంలో సహా అన్ని దేశాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనీ పేర్కొన్నారు.యుద్ధం కొనసాగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినటం ఖాయమన్నారు.
పశ్చిమ ఆసియా లో శాంతిని నెలకొల్పే విధంగా ప్రపంచ ప్రజలురెండు దేశాలపై వత్తిడిని పెంచడానికి ముందుకు రావాలని వేదిక కోరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాపర్తి రామ నరసయ్య, 10వ వార్డ్ కౌన్సిలర్ మామిడి రామారావు,టీఆర్ఎస్ నాయకుడు షేక్ నయుం, పొనుగోటి కోటయ్య, పాకనాటి రాఘవరెడ్డి,జె ఆర్ కె మూర్తి, అరుణోదయ ఉదయగిరి, అంజయ్య, నారపరాజు హరికిషన్ రావు జలంధర్, నాగరాజు,గోపీలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY