పౌరులు బాధ్యత తీసుకుంటేనే.., పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుంది

Sakshitha news

పౌరులు బాధ్యత తీసుకుంటేనే.., పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుంది

స్వర్ణాంధ్రా- స్వచ్ఛాంధ్ర లక్ష్యం నెరవేరుతుంది

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కల సహకారం అవుతుంది

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్

యాదమర్రిలో ఈ- ఆటోలను పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు

చిత్తూరు –

సమాజంలోని ప్రతి పౌరుడు బాధ్యత తీసుకుంటేనే.., ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశించిన స్వర్ణాంధ్రా- స్వచ్ఛాంధ్ర కల సహకారం అవుతుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, పూతల పట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పేర్కొన్నారు.

పూతల పట్టు నియోజకవర్గం, యాదమరి మండలం ఎంపిడివో కార్యాలయంలో
నిర్వహించిన స్వర్ణాంధ్రా- స్వచ్ఛాంధ్రా కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అంతకుముందు యాదమరికి చేరుకున్న ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్లకు యాదమరి మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు.

ప్రతి మూడవ శనివారం ఆనవాయితీగా నిర్వహించే స్వర్ణాంధ్రా- స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడారు. నవ్యాంధ్ర సాధనే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇందుకు సాగుతున్నారని గుర్తు చేశారు. అలాగే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, హరితాంధ్రా కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.
ప్రతి గ్రామం, పట్టణంలో పారిశుద్ధ్య ప్రమాణాలు పెంచి, చెత్త నిర్వహణను మెరుగుపరచడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, సంపూర్ణ అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఉన్నత ఆశయంతో ప్రారంభించారని వారు తెలియజేశారు. ఇది రాష్ట్రంలో దిగ్విజయంగా కొన సాగుతోందన్నారు.
ఇంటింటి నుంచి చెత్త సేకరణ, శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ చేపట్టడం, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టి పర్యావరణాన్ని రక్షించడం, స్వచ్ఛతను ప్రతి పౌరుడు బాధ్యతగా స్వీకరించేలా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు.

అదే సమయంలో మొబైల్ ను వినియోగాన్ని తగ్గించి, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని వారు సూచించారు.

పూతలపట్టు నియోజకవర్గంతో పాటు, యాదమరి మండల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఎంపీ, ఎమ్మెల్యేలు ఆ మండల ప్రజానికానికి భరోసానిచ్చారు.

అనంతరం 78.5 లక్షల ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన 25 ఈ- ఆటో లను జెండా ఊపి ప్రారంభించారు.అలాగే యాదమరి మండలంలోని పంచాయతీ ప్రతినిధులకు అప్పగించారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ .

ఈ కార్యక్రమంలో యాదమరి మండలం మండలాధ్యక్షులు మొరార్జీ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ చిత్ర, మాజీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి హేమగిరి, జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి అమరనాథ నాయుడు, టిడిపి జిల్లా కార్యదర్శి ధరణి, టిడిపి నాయకులు బజిలింగం, వినాయకం,ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top