ఎప్పటి నుంచో ఓటరు జాబితాలో పేరు ఉంది కదా అని ధీమాలో ఉండొద్దు .

Sakshitha news

ఎప్పటి నుంచో ఓటరు జాబితాలో పేరు ఉంది కదా అని ధీమాలో ఉండొద్దు …….. పూరించిన ఎన్యూమరేషన్ ఫారం జూలై 24 లోపు తిరిగి ఇవ్వకుంటే ఓటరు జాబితాలో పేరు తొలగించబడతాయి

బి.ఎల్.ఒ లు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని యుద్ధప్రాతిపదికన డిజిటలైజేషన్ చేయాలి
ఎస్.ఐ.ఆర్ పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

సాక్షిత వనపర్తి
జిల్లాలో ఉన్న ఓటర్లు ఇప్పటికే మా పేర్లు జాబితాలో ఎప్పటినుంచో ఉందని ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండా ఉంటే జాబితాలో ఓటరుగా పేరు తొలగించబడతాయని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఓటర్లను సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కొనసాగుతున్న ప్రక్రియ పై న్యూ ఢిల్లీ నుండి కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో పాల్గొన్న కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సెక్రెటరీ పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్.ఐ.ఆర్ గడువు జూలై 24 వరకు ఉందని, కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు 21.94 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తి అయ్యిందని చెప్పారు. మిగిలిన 14 రోజులు యుద్ధప్రాతిపదికన కనీసం రోజుకు 6 శాతం పూర్తి చేయాల్సి ఉంటుందని కలెక్టర్లకు ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ వనపర్తి జిల్లాలో 22.01 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తి అయ్యిందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చాలా నెమ్మదిగా డిజిటలైజేషన్ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చాలా మంది ఓటర్లు తమ ఓటు ఇప్పటికే జాబితాలో ఉంది కదా అని ధీమాతో ఉన్నట్లున్నారని, కానీ ఎస్.ఐ.ఆర్ అనేది ఓటరు జాబితా తొలి నుంచి ప్రారంభం అవుతుందని ఇంతకు ముందు జాబితా పూర్తిగా రద్దైపోయి కొత్త జాబితా రూపొందించడం జరుగుతుందన్నారు. బి.ఎల్. ఒ ల ద్వారా ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి బి.ఎల్.ఓ లకు ఇస్తే వాటిని మళ్ళీ డిజిటలైజేషన్ చేయాల్సి ఉన్నందున జిల్లాలోని ఓటర్లు వెంటనే ఫారాలను పూరించి వెంటనే తిరిగి ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఓటర్ల నుంచి తీసుకున్న ఫారాలన్ డిజిటలైజేషన్ చేయడానికి ఈరోజు నుండి ఒక్కో బి.ఎల్.ఓ వెంట ముగ్గురు వాలంటీర్లను నియమిస్తున్నట్లు తెలియజేశారు. పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆఫీసర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు కంప్యూటర్ ఆపరేటర్లు అందరు ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో పాల్గొని ఒక్కో బి.ఎల్.ఓ నుంచి రోజుకు కనీసం 100 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంటుందని ఆదేశించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారి నవీన్ కుమార్, రాష్ట్ర ఎలెక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి,జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top