ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను సత్కరించిన జిల్లా సాహితీ కళా వేదిక
సాక్షిత వనపర్తి
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో దాదాపు మూడు సంవత్సరాల పాటు అదనపు విధులతో సేవలందించిన ఉపాధ్యాయులను సాహితీ కళా వేదిక ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్య బోధనలోనే గాక జిల్లా విద్యా శాఖలోని అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించగలరని నిరూపించడం అభినందనీయం అన్నారు.
జిల్లా విద్యాశాఖలో జిసిడిఒ విధులు నిర్వహించిన శుభలక్ష్మిని,కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించిన యుగంధర్ ను కళావేదిక సభ్యులు శాలువ జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.తమ విధి నిర్వహణలో ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉంటూ వారందించిన ఉత్తమ సేవలను శంకర్ గౌడ్ కొనియాడారు.
ఈనాటి కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు కందూరు నారాయణ రెడ్డి,బైరోజు చంద్ర శేఖర్,ఎంఎ సత్తార్,దేశి రాములు యాదవ్, ఆర్డీఎస్ సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్, బండారు శ్రీనివాస్,గంధం నాగరాజు,డా.కంటే నిరంజనయ్య,జితేందర్, భాస్కర్, రామ్ రెడ్డి,శ్రీ లక్ష్మీ,మద్దిలేటి,కృష్ణవేణి, శోభ, నుష్రత్, తభసుం,శైలజ, పుష్పాలత,హేమలత,తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
