శ్రీవారికి కొప్పెర హుండీ విరాళం
సాక్షిత ప్రతినిధి – తిరుమల: తిరుమల శ్రీవారికి కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుపతి సమీపంలోని కొప్పెరవాండ్ల పల్లెకు చెందిన కొప్పెర సాయిసురేష్ ఈ మేరకు హుండీని తిరుమల ఆలయంలో పోటు పేష్కార్ మునిరత్నంకు అందించారు.
రాగి, ఇత్తడితో కలిపి తయారు చేసిన ఈ హుండీ బరువు 70 కిలోలు ఉంటుందని, దీని విలువ రూ.2.50 లక్షలని దాత తెలిపారు. తాము 1821 సంవత్సరం నుంచి వంశపారంపర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు సమర్పిస్తున్నామని వెల్లడించారు.
