హోంగార్డుల కుటుంబాలకు జిల్లా ఎస్పీ చేయూత
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: జిల్లాలో విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాలకు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు చేయూత అందించారు. వారికి ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటు ఆర్థిక సహాయం అందజేశారు.
విధులు నిర్వహిస్తూ అకాల మరణం పొందిన హోంగార్డు టి. రమేష్ బాబు సతీమణి యం.వసంతమ్మను కంపాస్సినేట్ అప్పాయింట్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశం కల్పిస్తూ అపాయింట్మెంట్ లెటర్‌ను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అందజేశారు.
అలాగే ఎన్. రమణారెడ్డి కుటుంబ సభ్యులకు రూ.5,00,000/- టి. సునీల్ కుమార్ కుటుంబ సభ్యులకు రూ.5,00,000/- జి. భాస్కర్ కుటుంబ సభ్యులకు రూ.5,00,000/- మొత్తం రూ.15,00,000/- ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో జిల్లా ఎస్పీ అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, “పోలీస్ శాఖకు అనుబంధంగా పని చేస్తూ సమాజానికి సేవలందిస్తున్న హోంగార్డు విభాగం మా కుటుంబ సభ్యులతో సమానం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డుల కుటుంబాలకు అండగా నిలవడం మా బాధ్యత.
వారి కుటుంబాలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హోంగార్డ్ డీఎస్పీ కె.జే.యం. చిరంజీవి, ఏవో కె. సురేష్ బాబు, ఆర్‌ఐ వి.ఎస్. రమణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY