చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సెల్ ఫోన్లను పంపిణీ చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ టీచర్లకు అందిస్తున్న సెల్ ఫోన్లను సద్వినియోగం చేసుకొని విధులు నిర్వహించాలని సూచించారు…
అనంతరం మండలంలోని లబ్ది దారులకు కల్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి…
37 మంది లబ్ది దారులకు కల్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి…
వివేక్ సార్ కామెంట్స్
ప్రజా పాలన కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు…
ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరుతుంది
ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు ప్రతి లబ్ది దారులకు ఇవ్వడం జరిగింది
గత ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్మును వృథా చేసింది
నిన్న నేను సీఎం రేవంత్ రెడ్డి కలిసి ప్రాజెక్టును సందర్శించడం జరిగింది
బాల్క సుమన్ నేను తేల్చిన నిధులే ఇప్పుడు ఖర్చు చేస్తున్నారు అని అంటున్నాడు
మరి నిధులు ఉంటే ఎప్పుడూ అభివృద్ధి ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలి
నువ్వు ఏమి అభివృద్ధి చేయలేదనే నిన్ను ఒడగొట్టారు ప్రజలు
కేవలం సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నాడు బాల్క సుమన్
నేను గెలిచాక ఇక్కడ అనేక అభివృద్ధి పనులు చేపట్టాను
చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను
ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడానికి జర్మనీ సంస్థ టామ్ కామ్ తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది
యువకులు జర్మనీలో ఉపాధి పొందాలంటే మా కార్యలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉపాధి పొందాలని సూచించారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY