విద్యార్థుల విద్యాభివృద్ధికి సైకిళ్ల పంపిణీ….

Sakshitha news

విద్యార్థుల విద్యాభివృద్ధికి సైకిళ్ల పంపిణీ….

ఎన్‌టీపీసీ రామగుండం సీఎస్‌ఆర్‌ సహకారంతో 500 మంది విద్యార్థులకు సైకిళ్లు..

–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : విద్యార్థుల విద్యాభ్యాసానికి దూరం అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ఎన్‌టీపీసీ రామగుండం సీఎస్‌ఆర్‌ సౌజన్యంతో గోదావరిఖని అశోక్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 500 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సైకిళ్లను సద్వినియోగం చేసుకుని క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరిస్తున్న ఎన్‌టీపీసీ రామగుండం సీఎస్‌ఆర్‌ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు.

విద్యార్థులకు సైకిళ్ల పంపిణీతో పాఠశాలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top